Sunday, November 17, 2024

New CM – ఢిల్లీ పీఠంపై యంగ్‌ లేడీ – సీఎంగా ఆతిశీకి గోల్డెన్ చాన్స్‌

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరణ
ఢిల్లీ యంగెస్ట్ సీఎంగా రికార్డు
స‌ల‌హాదారు నుంచి అంచ‌లంచెలుగా
ఢిల్లీకి మూడో మ‌హిళా ముఖ్య‌మంత్రి స్థాయికి
షీలా దీక్షిత్‌, సుష్మా త‌ర్వాత ఆతిశీకి చాన్స్‌
అత్య‌ధిక శాఖ‌ల‌న్నీ ఆమె చేతిలోనే

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:
ఆప్ నాయ‌కురాలు ఆతిశీ ఢిల్లీ ఎనిమిదో సీఎంగా శ‌నివారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సెనా ఆమెతో ప్ర‌మాణం చేయించారు. అప్ ఎమ్మెల్యేలు గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణం చేశారు. . ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

మూడో మహిళా సీఎం

ఢిల్లీ సీఎంగా అతిపెద్ద బాధ్యతను తనపై మోపిన ‘గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు’ అని ఆప్‌ నాయకురాలు ఆతిశీ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ మార్గదర్శకత్వంలో పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన షీలాదీక్షిత్‌, బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ త‌ర్వాత‌ ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా ఆతిశీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం దేశంలో మమతా బెనర్జీ ఒక్కరే మహిళా సీఎం కాగా, రెండో సీఎంగా ఆతిశీ నిలవనున్నారు. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతిచిన్న‌ వయస్కురాలు (43)గా కూడా ఆతిశీ నిలిచారు.

అత్యధిక శాఖలు ఆమె చేతిలోనే

సలహాదారు పదవి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఆతిశీ అతి చిన్న వయసులోనే అత్యధిక శాఖలు నిర్వహించిన మహిళగా ఖ్యాతి పొందారు. ఆప్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పార్టీ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2013లో ఆప్‌లో చేరిన ఆతిశీ అదే ఏడాది పార్టీ ప్రణాళిక ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 2020లో కల్కాజీ నుంచి గెలుపొందారు. గత ఏడాది ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అరెస్టయిన సంక్షోభ పరిస్థితుల్లో ఆమె మంత్రి పదవిని చేపట్టారు. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను చేపట్టిన ఆతిశీ.. సీఎం జైలుకెళ్లినప్పుడు అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఏకతాటిపై నిలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement