ట్విటర్‌కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ఇదంతా చెప్పిన మస్క్.. కొత్త సీఈవో ఎవరో మాత్రం చెప్పలేదు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేతగా తీరిక లేని షెడ్యూల్‌ను గడుపుతోన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్విటర్లో తాను కార్యనిర్వహక అధ్యక్షుడిగా కొనసాగుతానని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. సోషల్ నెట్‌వర్క్‌కు కొత్త నాయకుడిని కనుగొన్నానని, చీఫ్ టెక్నాలజిస్ట్‌గా కొత్త పాత్రలోకి మారనున్నానని యజమాని ఎలాన్ మస్క్ ప్రకటించారు. మరో ఆరు వారాల్లోగా కొత్త చీఫ్ వస్తారని తెలిపారు. ట్విట్టర్‌కు కొత్త సీఈఓగా ఓ మహిళను నియమించనున్నట్లు చెప్పారు ఎలాన్ మస్క్. దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆమె ఎవరనేది తెలియజేయలేదు. ఎన్బీసీ యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్ లిండా యాకారినో ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉండటానికి చర్చలు జరుపుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది
Advertisement
తాజా వార్తలు
Advertisement