Monday, November 18, 2024

మారుతీ నుంచి మార్కెట్ లోకి కొత్త కారు.. మోడ‌ల్ ఫీచ‌ర్స్ ఇవే !

దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ… ఇండియ‌న్ మార్కెట్ లోకి తాజాగా మరో కొత్త కారును తీసుకువ‌చ్చింది. బడ్జెట్ ధరతో, అదిరే ఫీచర్లతో.. మారుతీ ఫ్రాంక్స్ అనే ఈ కొత్త కారును లాంచ్ చేసింది. ఈ కారును ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. కాగా, ఇప్పుడు ఇది అధికారికంగా మార్కెట్‌లోకి వ‌చ్చింది. టాటా మోటార్స్ నెక్సన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సొనెట్ వంటి మోడళ్లకు పోటీగా మారుతీ సుజుకీ ఈ కొత్త ఫ్రాంక్స్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి దింపింది.

కాగా, ఈ కొత్త కారు లుక్స్ అయితే అదిరిపోయాయి. ఇది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కారు ప్రారంభ ధర రూ.7.46 లక్షలుగా ఉండ‌గా… ఈ మోడ‌ల్ లోని టాప్ఎండ్ గరిష్ట ధర రూ.13.13 లక్షలుగా ఉంది. ఈ కొత్త కారు నెక్సా డీలర్ షిప్స్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో రానుంది.

ఫ్రాంక్స్ కారు మొత్తంగా ఐదు (సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జెటా, అల్ఫా) వేరియంట్ల రూపంలో కస్టమర్లకు లభించనుంది. వేరియంట్ ని బ‌ట్టి ధర కూడా మారుతూ ఉంటుందని కంపెనీ వ‌ర్గాలు తెలిపాయి.

  • సిగ్మా వేరియంట్ ధర రూ.7.46 లక్షలు
  • డెల్టా వేరియంట్ ధర రూ. 8.32 లక్షల నుంచి రూ. 9.72 లక్షల వ‌ర‌కు
  • డెల్టా ప్లస్ ధర రూ.872 లక్షల నుంచి రూ. 9,78 లక్షల వ‌ర‌కు
  • జెటా వేరియంట్ ధర రూ. 10.55 లక్షల నుంచి రూ. 12.05 లక్షలవ‌ర‌కు
  • అల్ఫా వేరియంట్ ధర రూ. 11.47 లక్షల నుంచి రూ.13.13 లక్షల వ‌ర‌కు

మారుతీ ఫ్రాంక్స్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది.

  • 1.2 లీటర్ డ్యూయెల్ జెట్ డ్యూయెల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.
  • 1 లీటర్ టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ మరో ఆప్షన్.
  • 5 స్పీడ్ ఏఎంటీ, ఎంటీ ఆప్షన్ ఉంటుంది.
  • 6 స్పీడ్ ఏఎంటీ ఆప్షన్ కూడా ఉంది.

మారుతీ ఫ్రాంక్స్ ఫీచ‌ర్స్..

ఈ కొత్త కారు మైలేజ్ విషయానికి వస్తే.. లీటరుకు 20 నుంచి 22.89 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎల్ఈడీ మల్టీ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, 16 ఇ:చ్ అలాయ్ వీల్స్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 9 ఇంచుల హెచ్‌డీ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, హెడ్ అప్ డిస్2ప్లే, టర్న్ బై టర్న్ నావిగేషన్, 360 డిగ్నీ వ్యూ కెమెరా, వైర్‌లెస్ చార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఏబీఎస్ విత్ ఈబీడీ, త్రి పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్స్, ఈపీఎస్ విత్ హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement