Saturday, July 6, 2024

New Busses – 132 సీట్ల కేపాసిటీతో అధునాత‌న బ‌స్సులు…. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రి

ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఇందులో భాగంగానే 132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారీ సీట్లు కలిగిన బస్సు పైలట్‌ ప్రాజెక్టు నాగ్‌పుర్‌లో కొనసాగుతోందని నేడు జ‌రిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

‘కాలుష్యం ముప్పును ఎదుర్కొనేందుకు కాలుష్యరహిత ఇంధనం, స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరం. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వందల సంఖ్యలో ఇథనాల్‌ పంపులు ఏర్పాటు అవుతున్నాయి. రూ.120 లీటరు పెట్రోల్‌కు ఖర్చుపెట్టే బదులు రూ.60తో ఇథనాల్‌ వాడటం ఉత్తమం. డీజిల్‌ బస్సు కి.మీ. ప్రయాణానికి రూ.115 ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుకు రూ.50 నుంచి రూ.60 అవుతుంది. దీంతో టికెట్‌ ధర 15 నుంచి 20 శాతం తగ్గుతుంది’ అని సూచించారు.

- Advertisement -

30 శాతం తగ్గనున్న ఖర్చు..
అలాగే టాటా సహకారంతో నాగ్‌పుర్‌లో ఓ పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాం. మన ప్రాజెక్టులోనూ 132 మంది కూర్చునేవిధంగా బస్సును రూపొందిస్తున్నాం. 40 కి.మీ. దూరం వెళ్లాక ఛార్జింగ్‌ చేసుకోవాలి. కేవలం 40 సెకన్ల పాటు ఛార్జింగ్‌ చేస్తే 40 కి.మీ. వెళ్లొచ్చు. కి.మీ. ఖర్చు రూ.35 నుంచి రూ.40 మాత్రమే అవుతుంది. ఈ బస్సులో విమానంలోలా సీటింగ్‌, ఏసీ, సీటు ముందు ల్యాప్‌టాప్‌ పెట్టుకొనే సౌలభ్యం ఉండాలని సూచించాం. ఎయిర్‌ హోస్టెస్‌ మాదిరిగా ఫ్రూట్స్, ప్యాక్‌ డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇచ్చేందుకు ‘బస్‌ హోస్టెస్‌’ ఉంటారు. డీజిల్‌ బస్సుతో పోలిస్తే దీని నిర్వహణకు 30శాతం ఖర్చు తగ్గుతుందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement