Friday, October 18, 2024

New Army Deal – మ‌న‌కూ డ్రోన్ లు వచ్చేస్తున్నాయి…

అమెరికాతో డీల్ కుదుర్చుకున్న భార‌త్
మొత్తం 31 ప్ర‌డేట‌ర్ డ్రోన్స్…
రూ 32వేల కోట్ల‌కు ఒప్ప‌దం
నేడు ఢిల్లీలో అగ్రిమెంట్ పై ఇరుదేశాలు సంత‌కాలు

న్యూ ఢిల్లీ – రక్షణ రంగంలో భారత్ మరో చారిత్రాత్మకమైన ఒప్పందం చేసుకున్నది. భారత సైన్యం మరింత బలోపేతం దిశగా ప్రిడేటర్ డ్రోన్స్ కోసం అమెరికాలో అత్యంత విలువైన ఒప్పందం చేసుకున్నది… అమెరికా ఆర్మీ, కార్పొరేట్ ప్రతినిధులతో భారత రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీలో నేడు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

మొత్తం 31 ప్రిడేటర్ డ్రోన్స్ కొనుగోలు కోసం.. ఏకంగా 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఇండియా. ఈ 31 ప్రిడేటర్ డ్రోన్స్ లో 15 డ్రోన్స్ నౌకాదళంకు.. మిగిలిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీలకు కేటాయిస్తుంది భారత రక్షణ శాఖ. దీని వల్ల సముద్రంలో భద్రతా చర్యలు మరింత వేగవంతం కావటంతోపాటు.. సముద్రపు దొంగల పనిని ఇట్టే అరికట్టొచ్చు.

- Advertisement -

ప్రిడేటర్ డ్రోన్స్ అంటే పైలెట్ లేని.. అతి పెద్ద డ్రోన్ అన్నమాట.. చిన్న విమానం సైజులో ఉంటుంది ఈ డ్రోన్.. ఈ డ్రోన్ ద్వారా నిఘా పెట్టొచ్చు.. దేశ సరిహద్దుల్లో గస్తీని పటిష్ఠం చేసుకోవచ్చు.. మన ఎక్కడ ఉన్నా.. ఈ డ్రోన్ సాయంతో చిటికెలో శత్రువులను మట్టుపెట్టొచ్చు అన్నమాట.. ఇలాంటి ప్రిడేటర్ డ్రోన్స్ కొనుగోలు చేయటానికి.. అమెరికాతో డీల్ కుదుర్చుకున్నది ఇండియా..


భారత్, అమెరికాలో మధ్య రక్షణ వ్యవహారాలకు సంబంధించి జరిగిన పెద్ద డీల్స్ లో ఇది ఒకటి. ప్రిడేటర్ డ్రోన్స్ రాకతో భారత ఆర్మీ మరింత బలపడుతుంద‌ని అంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement