డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి జంట నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలు హాజరయ్యారు. డ్రగ్స్ విక్రేతలు, వాడకందారులపై తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ సమావేశంలో చర్చ జరిగింది. అయితే డీజీపీ నిర్వహించిన సమావేశంలో కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డ్రగ్స్ అమ్మకందారులు, వినియోగదారుల చిట్టా తయారు చేసింది పోలీసుశాఖ.. గతంలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్లతో చిట్టా సిద్ధమైంది. సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలు, విద్యార్థులకు సంబంధించిన పేర్లతో చిట్టా సిద్ధమైనట్లుగా పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ తో పాటుగా గంజాయి తీసుకున్నవారి వివరాలను కూడా పోలీసుశాఖ పొందుపర్చింది. మరోవైపు డ్రగ్స్ విక్రయాలపై నిరంతర నిఘాకు కొత్త యాప్‌ను రూపొందించారు. ఆ యాప్ లో డ్రగ్స్ విక్రయదారుల సంబంధించిన పూర్తి సమాచారంతో అందుబాటులో ఉంచనున్నారు. ఇక, సీఎంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో హై లెవల్ మీటింగ్ జరగనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..