విశాఖ జిల్లా జుత్తాడలో జరిగిన ఆరుగురు హత్యల వెనుక మరో కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలు చేసింది అప్పలరాజు ఒక్కడే కాదని, మరో ఆరుగురు ఉన్నారని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబీకులు సోమవారం నాడు మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌ను కలిశారు. ఈ సందర్భంగా అప్పలరాజుతో పాటు ఈ కేసులో ఉన్న మరో ఆరుగురిని వెంటనే చంపేయాలని వారు డిమాండ్ చేశారు. అభం, శుభం తెలియని వారిని కూడా నిందితులు చంపేశారని మృతురాలు అరుణ కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా జుత్తాడ పరిధిలో ఉన్న అప్పలరాజు అక్రమ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలని కోరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement