మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ బుధవారం సరికొత్త బాలెనో కారును భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు ఇది. న్యూ ఏజ్ బాలెనో అని పిలుస్తారు. బాలెనో మోడల్స్‌లో అత్యున్నతమైన ఇన్-కార్ టెక్నాలజీ, ఎక్స్‌ప్రెసిివ్ ఫీచర్లతో వచ్చింది. అల్టిమేట్ అర్బన్ క్రూజింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం క్లాస్ లీడింగ్ సేఫ్టీ ఫీచర్ ఉంది. మారుతీ సుజుకీ 2022 బాలెనో ఐదు రంగులతో అందుబాటులో ఉంది. ఇందులో ఆరు గెయిర్ బ్యాగ్స్, యాంటీ హిల్ కంట్రోల్ ఉన్నాయి. సుజుకీ లోగో, డీఆర్‌ఎల్ టెయిల్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్ ఉంటాయి. 9 అంగుళాల స్మార్ట్ డిస్ ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలెక్సా వాయిస్‌తో పాటు 1.2 లీటర్ డ్యుయెల్ జెట్ కే12 ఎన్ పెట్రోల్ ఇంజిన్ సొంతం.
ఇది 6,000 ఆర్‌పీఎం వద్ద… 90 హెచ్‌బీ పవర్, 4,400 ఆర్‌పీఎం వద్ద 113 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ లభిస్తాయి. న్యూ ఏజ్ లీటర్‌కు మ్యానువల్‌లో 22.35 కి.మీ, ఆటోమెటిక్ వెర్షన్‌లో.. 22.94 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కొత్త బాలెనో కారు ధర సుమారు రూ.6.35 లక్ష నుంచి రూ.9.49 లక్షలు (ఎక్స్ షోరూం, ఇండియా) వరకు ఉంది. బుకింగ్స్ ఇప్పటికే ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం అయ్యాయి. 2022 బాలెనో లాంచ్ కావడం కన్నా ముందే.. 25,000 బుకింగ్స్ రావడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..