Tuesday, November 26, 2024

ఆర్బీఐ ఆమోదం తర్వాతే కొత్త ఖాతాలు: పేటీఎం

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో కొత్త కస్టమర్లును చేర్చుకోవద్దని ఆర్బీఐ ఆదేశాలపై పేటీఎం స్పందించింది. రిజర్వ్‌బ్యాంక్‌ ఆదేశాలకు అనుగుణంగా కొత్త ఖాతాదారులను అన్‌బోర్డింగ్‌ చేయకుండా తక్షణ చర్యలు చేపట్టామని తెలిపింది. ఆర్బీఐ సూచించిన మేరకు రెగ్యులేటర్‌తో కలిసి పనిచేయనున్నామని పేర్కొంది. ఆర్బీఐ ఆమోదం పొందిన తర్వాతే కొత్త ఖాతాలను ప్రారంభిస్తామని ప్రకటనలో తెలిపింది. పేటీఎం యాప్‌ వినియోగించే కొత్త వినియోగదారులు పేటీఎం యూపీఐ హ్యాండిల్స్‌ సృష్టించవచ్చు.

వారి ప్రస్తుత పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతా లేదా ఇతర బ్యాంకు ఖాతాలకు లింక్‌ చేయవచ్చని పేటీఎం తెలిపింది. కాగా బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1949లోని సెక్షన్‌ 35ఎ ప్రకారం ఆర్బీఐ పేటీఎంను కొత్త ఖాతాదారులను చేర్చుకోవద్దని ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో పర్యవేక్షణ లోపాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement