Saturday, November 23, 2024

ICC | క్రికెట్‌లో కొత్త రూల్… అలా చేస్తే 5-పరుగుల పెనాల్టీ

అంతర్జాతీయ క్రికెట్ మండలి.. క్రికెట్‌లో కొత్త నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. పురుషుల ODI, T20I క్రికెట్‌లో స్టాప్ క్లాక్ అనే కొత్త రూల్‌ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఆటలోని బౌలివంగ్ జట్టు ఓవర్‌ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించేందుకు ఈ నియమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

కొత్త నిబంధన ప్రకారం, ఒక బౌలింగ్ జట్టు 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ వేయడానికి సిద్ధంగా లేకపోతే… ఐదు పరుగుల పెనాల్టీ విధించనున్నట్టు ప్రకటించింది ఐసీసీ. ఇక నుంచి ఓవర్ల మధ్య సమయాన్ని తనిఖీ చేయడానికి మ్యాచ్ అధికారులు దగ్గర స్టాప్-క్లాక్ ఉంటుంది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు ప్రయోగాత్మకంగా అమలులో ఉండనున్నట్టు ఐసీసీ తెలిపింది.

“ఈ రూల్ ఆట వేగాన్ని… ప్రేక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఒక ప్ర‌య‌త్నం” అని ICC ఒక ప్రకటనలో తెలిపింది. ఇక దాంతో పాటు.. ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక‌పై జట్టుని తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఐసీసీ… వచ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ పురుషుల అండర్-19 ప్రపంచ కప్‌ను శ్రీలంక నుండి దక్షిణాఫ్రికాకు నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement