Tuesday, November 19, 2024

ఎప్పుడో కాదు ఇప్పుడు సాయం కావాలి….కేంద్రంపై ప్రశాంత్ కిషోర్ విమర్శలు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ కేంద్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు కేంద్రం ప్రకటించిన సాయాన్ని ప్రశాంత్ కిషోర్ తప్పు బట్టారు. 18 ఏళ్లు నిండిన తరువాత వచ్చే సాయం కన్నా.. వారికి ప్రస్తుత సాయం చాలా అవసరం అని అన్నారు ప్రశాంత్.

బీ గ్రేట్ ఫుల్ టు పీఎం కేర్స్ ఫర్ ప్రామిస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటూ ట్వీట్ చేసిన ప్రశాంత్…. ప్రధాని ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ ఇది మోడీ ప్రభుత్వం మరో మాస్టర్ స్ట్రోక్ గా అంటూ చెప్పుకొచ్చారు. నిధులు ఎప్పుడో ఇవ్వడం కాదు.. తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆయుష్మాన్ భారత్ అన్నారు.. 50 కోట్ల మంది ఆరోగ్య అవసరాలు తీరుస్తామన్నారు.. తీరా చూస్తే ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి అంటూ విమర్శలు చేశారు ప్రశాంత్.

Advertisement

తాజా వార్తలు

Advertisement