బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని అవమానించాడు ఓ నెటిజన్..దానికి ఆయన ఎంతో ఓర్పుగా బుద్ది చెప్పారు. వివరాల్లోకి వెళ్తే… ఈ ఘటన సోమవారం మధ్యాహ్న సమయంలో జరిగింది. ఉదయకాల సమయం దాటిపోతున్న సమయంలో 11.30 గంటలకు గుడ్ మార్నింగ్ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. దానిపై పలువురు నెటిజన్స్ ట్రోల్స్ మొదలెట్టారు. ఓ నెటిజన్ “ఇది మధ్యాహ్నం ముసలోడా అని కామెంట్ చేయడం గమనార్హం.అప్పటికే తన గుడ్ మార్నింగ్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఓపికగానే సమాధానం చెబుతూ వచ్చిన అమితాబ్… తనను ముసలోడా అంటూ కామెంట్ చేసిన నెటిజన్‌కు కూడా ఓపికగానే బదులిచ్చారు. మీరు చాలా కాలం బ్రతకాలని ప్రార్థిస్తున్నాను. అయితే మిమ్మల్ని ఎవరూ ముసలోడు అని పిలిచి అవమానించకూడదని కోరుకుంటున్నానని సరైన తీరుగా పంచ్ వేశారు. అమితాబ్ సమయస్పూర్తిని పలువురు కొనియాడుతున్నారు.
అమితాబ్ ని ముసలోడ అని అవమానించిన నెటిజన్ – సమయస్ఫూర్తిగా బదులు చెప్పిన నటుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement