ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : తెలంగాణ తల్లిని కించపరిస్తే నేరమే అవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం మన జాతి అస్తిత్వ, ఆ్తమగౌరవల ప్రతీక అని తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం గానీ, వేరే విధంగా చూపించడం గానీ నిషేధింస్తున్నట్లు ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ, ఇతర ప్రదేశాలలో గాని ఆన్ లైన్ లో గాని, సామాజిక మాధ్యమాలలో గాని, మాటలు లేక చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరిచడం నేరంగా పరిగణించబడుతుందని జీవోలో పేర్కొంది.