Thursday, November 21, 2024

త‌న పిల్ల‌ల‌కి లిప్ కిస్ ఇచ్చిన న‌టి.. ట్రోల్స్ చేస్తోన్న నెటిజ‌న్స్

బాలీవుడ్ న‌టి ఛ‌వి మిట్ట‌ల్ త‌న పిల్ల‌ల‌కి లిప్ కిస్ ఇచ్చిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ ఫోటోల‌ను ఇలా పోస్ట్ చేసిందో లేదో.. అలా ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమెపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. పిల్లలకు లిప్ కిస్ ఇవ్వడమేంటి, వాళ్లకు ఇప్పట్నుంచే ఏం నేర్పిస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తూ కామెంట్స్ చేయగా, మరికొంతమంది పిల్లలకు మీ బ్యాక్టీరియాని పంచుతున్నారు, ఆరోగ్యపరంగా ఇది మంచిది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న పిల్లలకు లిప్ కిస్ ఇస్తున్న ఫోటోలని ఛవి మిట్టల్ పోస్ట్ చేయడంతో… ఆమెను వదిలిపెట్టడంలేదు నెటిజన్లు.. మాములు జనాలతో పాటు.. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆమె చేసిన పనిని తప్పుపడుతున్నారు.

కామెంట్స్ రూపంలో వారి అభిప్రయాలు తెలియజేస్తుననారు. మరికొంత మంది మాత్రం.. నువ్వు పెడితే పెట్టావు.. కాని ఇలా అందరికి తెలిసేలా ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అంటూ.. తిట్టిపోస్తున్నారు. అయితే ట్రోల్స్ చేస్తే.. తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవాలి.. కాని ఈ కామెంట్స్ చూసి మరీ రెచ్చిపోయింది చవీ మిట్టల్. ఆగకుండా మరిన్ని లిప్ కిస్ ఫోటోలు పోస్ట్ చేసింది. తన పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తున్న ఫోటోలు మరిన్ని షేర్ చేసి.. ఒక తల్లి పిల్లలపై చూపించే ప్రేమకి ఇలాంటి కామెంట్స్ వస్తాయని నేను ఊహించలేదు. నేను నా పిల్లలకు ముద్దులు ఇస్తున్న మరి కొన్ని ఫోటోలు కూడా షేర్ చేస్తున్నాను అంటూ ఎక్కువ ఫోటోలు షేర్ చేసింది. నా పిల్లలపై ఉన్న నాకున్న ప్రేమ అమితమైనది. దాన్ని ఎలా చూపించాలో తెలియదు. అందుకే నేను ఇలానే చూపిస్తాను. ప్రేమను చూపించడంలో ఇదొక పద్ధతి. కౌగలింతలు, ముద్దులతో వారిపై నాకున్న ప్రేమను చూపిస్తాను. నాపై వచ్చిన ట్రోల్స్ కి నాకు సపోర్ట్ గా నిలిచినవాళ్లకు థాంక్యూ, ఇంకా మానవత్వం బతికే ఉంది. ఇలా అనే వాళ్ళు తమ పిల్లలపై ప్రేమను ఎలా చూపిస్తారో తెలియచేయండి అని కౌంటర్ ఇచ్చింది ఛవి మిట్టల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement