ఇండియన్ సినిమా ప్రైడ్ విజనరీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” తో తాను గ్లోబల్ దర్శకుడు అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. జక్కన్న తెరకెక్కించనున్న నెక్స్ట్ సినిమాలు అన్నీ కూడా ఈ లెవెల్లోనే ఉండగా.. తాను ఎప్పటి నుంచో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకు వస్తున్న సినిమా “మహాభారతం” అని అందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ పై జక్కన్న చేసిన స్టేట్మెంట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.
దేశంలో దొరికే మొత్తం మహాభారతం పుస్తకాలన్నీ చదవాలంటే కనీసం ఒక సంవత్సరం పడుతుందని.. ఈ సినిమాని తాను ప్లాన్ చేస్తే మొత్తం ఎలా లేదన్నా 10 భాగాలుగా చేస్తానని తెలిపారు. దీంతో ఇక మొత్తం 10 పార్ట్ లు అంటే ఎప్పటికి అంటూ సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. మాములుగా జక్కన్న కమిట్మెంట్ కి ఒక్క సినిమాకి ఎంత సమయం కేటాయిస్తారో తెలిసిందే. ఇక తన డ్రీం ప్రాజెక్ట్ అంటే ఎంత డీటైల్డ్ గా తీస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ 10 భాగాల సినిమా ఎలా ఎప్పుడు స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తారో చూడాలి.