Tuesday, November 26, 2024

మెగాస్టార్ చిరంజీవి నోట షాయరీ.. అద్భుతమంటోన్న ఫ్యాన్స్

రంగమార్తాండ చిత్రం కోసం తన గళాన్ని వినిపించారు మెగాస్టార్ చిరంజీవి.మరాఠీలో అద్భుత విజయం సాధించిన నటసామ్రాట్ సినిమాకు రీమేక్‌గా రంగమార్తాండ వస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలో మార్పులు చేశారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. నేనొక నటుడ్ని’ అంటూ ‘రంగమార్తాండ చిత్రం కోసం షాయరీ లో చిరంజీవి పలికించిన భావోద్వేగం వహ్వా అనిపిస్తోంది. అల్పసంతోషిని, దేవుడ్ని, జీవుడ్ని, నవ్విస్తా, ఏడిపిస్తా, ఆప్తుడిని, దాసుడిని అంటూ.. మెగాస్టార్ నోట వచ్చిన ఆ షాయరీకి తగ్గట్టు ఇళయరాజా సంగీతం కూడా భలే కుదిరింది. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ రంగమార్తాండ సినిమాలో ‘షాయరీ’కు చిరంజీవి వాయిస్‌ ఇచ్చారు. యూట్యూబ్‌లో ఇలా విడుదలైందో లేదో అప్పుడే లైక్‌లు, షేర్‌లతో దూసుకెళ్తోంది..నేనొక నటుడ్ని అంటూ సాగిన మాటల మ్యాజిక్‌కి సంబంధించిన ఈ వీడియోలో.. చిరంజీవి ప్రస్థానాన్ని సందర్భోచితంగా చూపిస్తూ ప్రజెంట్ చేశారు. కృష్ణవంశీ డైరెక్షన్‌లో వస్తున్న రంగమార్తాండ మూవీకి చిరంజీవి వాయిస్‌ అదనపు ఎట్రాక్షన్‌గా నిలిచింది. లక్ష్మీభూపాల అక్షరానికి, చిరంజీవి గాత్రం తోడై వచ్చిన ఈ షాయరీ ప్రశంసలు అందుకుంటోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement