కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా జాతివివక్ష వ్యతిరేక పోరాటయోధుడు నెల్సన్ మండేలా అరెస్టు వారంట్ భారీ ధర పలికింది. ద.ఆఫ్రికా ప్రజాస్వామ్య పోరాటాన్ని డాక్యుమెంట్ చేసే హెరిటేజ్ సైట్‌కు నిధులు సమీకరించే క్రమంలో 1961 నాటి -ఈ అరెస్టు వారంట్‌ను వేలానికి ఉంచగా, 1.3 లక్షల డాలర్లకు అమ్ముడైంది. ఈ సొమ్మును లిలీస్‌లీఫ్ మ్యూజియం హెరిటేజ్ సైట్‌కి వెళ్తుంది. ఒరిజినల్ అరెస్టు వారంట్ నుంచి సృష్టించబడిన నాన్ ఫంగబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టి)కు వేలంలో మంచి డిమాండ్ లభించింది. ఈ ఎన్‌ఎఫ్‌టీని 2004లో లిలీస్‌లీఫ్ మ్యూజియం విరాళంగా స్వీకరించింది. వర్ణవివక్ష వ్యతిరేక కార్యకర్తగా మండేలా 27 ఏళ్లు జైలుశిక్ష అనుభవించారు. 1962లో శేత-మైనారిటీ ప్రభుతాన్ని కూలగొట్టడానికి కుట్ర పన్నినందుకు ఆయన్ను అరెస్టు చేశారు. 1990లో జైలు నుంచి విడుదల అయ్యారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1994లో దేశ మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చివరకు 2013లో 95 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. గతేడాది మరో స్వాతంత్య్ర సమరయోధుడు ఆలివర్ టాంబోకు చెందిన పెన్‌గన్ ఎన్‌ఎఫ్‌టీ వేలం తర్వాత మ్యూజియం దాదాపు 55 వేల డాలర్లు సమీకరించింది. కోతులు, సింహాల వ్యంగ్య చిత్రాలతో మిలియన్ డాలర్ల ధరతో ఎన్‌ఎఫ్‌టీలు ఇటీవలి నెలల్లో జనాదరణ పొందాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...