Tuesday, December 3, 2024

Nellore – ఏసీబీకి ముత్తుకూరు తహశీల్దార్ ….

ముత్తుకూరు ,డిసెంబర్ 3 (ఆంధ్రప్రభ) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం తాహశీల్దార్ బాలకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పంటపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా నేడు కార్యాలయం వద్ద ఏసీబీ మాటు వేసి తాహశీల్దారును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా, జిల్లా ఏసీబీ అధికారులు తాహసిల్దార్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement