Friday, November 22, 2024

Nelakondapalli – బౌద్ధ స్థూపాల‌ అభివృద్దికి రోడ్ మ్యాప్

అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ మహాస్థూపం తీర్చిదిద్దేంకు చ‌ర్య‌లు తీసుకుంటాం

ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తున్న నేల‌కొండ‌ప‌ల్లి

భ‌క్త‌రామ‌దాసు ధ్యాన మందిరం,

భౌద్ధ స్థూపాల‌ అభివృద్ది త‌గిన విధంగా రోడ్ మ్యాప్ రెడీ

అధికారుల‌ను ఆదేశించిన ఉప ముఖ్య‌మంత్రి భట్టి

- Advertisement -

మంత్రులు పొంగులేటి, జూప‌ల్లితో ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌ట‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యానమందిరం, బౌద్ధ మహాస్థూపాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ రఘురామిరెడ్డితో కలిసి ఆయన సోమ‌వారం సందర్శించారు. స్థానిక బౌద్ధ మహాస్థూపం విశేషాలను పురావస్తు శాఖ, పర్యటక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రోడ్ మ్యాప్ రెడీ చేయాలి..

క్రీస్తుశకం రెండో శతాబ్దం నాటి ఈ స్థూపాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వెంటనే రోడ్‌మ్యాప్‌ తయారు చేసి డీపీఆర్‌ను సమర్పించాలని ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పర్యటకులను నేలకొండపల్లి ఆకర్షిస్తోందని, ఇంకా ఎక్కువ మంది ఈ కేంద్రాలను సందర్శించేలా వసతులు మెరుగుపరచాలని చెప్పారు. అనంతరం భక్తరామదాసు నివాస స్థలం, ధ్యాన మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ నూతనంగా నిర్మించనున్న ఆడిటోరియం నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement