Sunday, November 17, 2024

UP | నిర్లక్ష్యం, మానవ హక్కుల ఉల్లంఘన… ప్రభుత్వానికి నోటీసులు !

లక్నో : ఝాన్సీ జిల్లా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో 10మంది చిన్నారులు మరణించిన అగ్నిప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనపై సుమోటోగా స్పందించింది.

ప్రమాదానికి సంబంధించిన నివేదికలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది. బాధితులు ప్రభుత్వ సంరక్షణలో ఉన్నందున, ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనేనని అభిప్రాయపడింది. ఈ ఘటనపై వారంలో రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

ఈ ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌ స్టేటస్‌, బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలు, క్షతగాత్రులకు అందుకున్న వైద్యం, బాధిత కుటంబాలకు ఇస్తున్న పరిహారం తదితర సమగ్ర వివరాలు నివేదికలో పొందుపర్చాలని ఆదేశించింది.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తీసుకున్న లేదా ప్రతిపాదించిన చర్యలను కూడా వివరించాలని హక్కుల కమిషన్‌ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement