నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి రోడ్డుపై గడపాల్సిన పరిస్థితి వచ్చింది. గురువారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణి స్త్రీకి చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులను కోరారు. చికిత్స అందించకపోగా బోధన్ ఆసుపత్రి సిబ్బంది వారిని బయటకు గెంటేశారు. దీంతో ఆ రాత్రి సమయంలో ఏమీ చేయలేని స్థితిలో బయట గేటు వద్ద నిరాశ నిస్ప్రుల మధ్య ఉన్న పరిస్థితి దయనీయకరమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి ఏ వెహికల్ ఉంటుందని, ఎక్కడికి వెళ్లాలని కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశ్నించినప్పటికీ కనికరించకపోవడం బాధాకరమన్నారు. పురిటి నొప్పులతో ఉన్న మహిళకు ఈ విధంగా చికిత్సలు అందించకుండా బయట గెంటి వేయడం ఎంతవరకు సమంజసం అని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. అర్ధరాత్రి ప్రసవానికి వెళ్తే గెంటేశారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement