Tuesday, November 26, 2024

బ్యాంకు ఖాతాదారులకు గమనిక… 14 గంటల పాటు NEFT సేవలు బంద్

ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ఉపయోగించే NEFT(నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. NEFT పనితీరును మరింత మెరుగుపర్చడం కోసం మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక అపడేషన్‌ చేపడుతున్నట్లు తెలిపింది. దీంతో మే 23న ఉ.00.01 గంటల నుంచి(అంటే మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి) మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్‌ సేవలు అందుబాటులో ఉండవు. అయితే ఆర్‌టీజీఎస్‌ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆర్‌బీఐ తెలిపింది. దీనిపై ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారమిస్తాయని పేర్కొంది. కాగా గతంలోనూ ఏప్రిల్‌ 18న ఆర్‌టీజీఎస్‌ సాంకేతిక వ్యవస్థలోనూ ఆర్‌బీఐ ఇలాంటి టెక్నికల్‌ అప్‌గ్రేడ్‌ చేపట్టింది. 2019 డిసెంబరు నుంచి నెప్ట్‌ సేవలను 24×7 గంటల పాటు ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement