ఢిల్లీ – వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో . 48 కేజీల విభాగంలో భారత్ బాక్సర్ నీతూ ఘంగాస్‌కు బంగారు పతకం దక్కింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన తుదిపోరులో అల్టాంట్‌సెట్‌సెగ్‌ను 5-0తో ఓడించింది. రెండుసార్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత మంగోలియాకు చెందిన లుత్‌సైఖాన్ అల్టాంట్‌సెట్‌సెగ్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. క్వార్టర్, సెమీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టి ఫైనల్‌కు దూసుకొచ్చిన నీతూ ఫైనల్ లోనూ రెచ్చిపోయింది. నీతూ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆరో భారతీయ బాక్సర్‌గా అవతరించింది. మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010 మరియు 2018), సరితా దేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్ (2006), లేఖా కెసి (2006) మరియు నిఖత్ జరీన్ (2022) గతంలో విజేతలుగా నిలిచారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement