నీట్ యూజీ పరీక్షకు సంబంధించి రివైజ్డ్, తుది స్కోర్ కార్డు, ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా ఈ మెరిట్ లిస్టును రిలీజ్ చేసింది. కాగా, అంతకముందు ఈ పరీక్షకు సంబంధించి ఫైనల్ రివైజ్డ్ ఆన్సర్ కీని కూడా విడుదల చేసింది. విద్యార్థులు తమ రివైడ్డ్ ఫలితాలను exams.nta.ac.in/NEET వెబ్‌సైట్‌లో… రివైజ్డ్ కీని https://nta.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
తాజాగా విడుదల చేసిన రివైజ్డ్ రిజల్ట్స్ ప్రకారం .. 17 మంది అభ్యర్థులకే 1వ ర్యాంకు వచ్చింది. ఈ ఏడాది మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షను మొత్తం 24,06,079 మంది అభ్యర్థులు రాయగా… వీళ్లలో 10,29,154 మంది అబ్బాయిలు, 13,76,831 మంది అమ్మాయిలు, 18 మంది థర్డ్ జెండర్ వారు ఉన్నారు.