Sunday, October 6, 2024

NEET UG 2024- నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్ వాస్త‌వం

బీహార్ లో అరెస్ట్ అయిన అభ్య‌ర్ధి వెల్ల‌డి
ముందు రోజే త‌మ చేతికి అందింది
రూ.30 ల‌క్ష‌ల‌కు ముగ్గురికి అమ్మిన‌ట్లు స్టేట్మెంట్ ..

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష () ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తేలిపోయింది. ఈసారి నీట్ పరీక్షలో భారీ సంఖ్యలో టాపర్లు రావడంతో దీనిపై అనుమానాలు మొదలయ్యాయి. చివరికి అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అరెస్టు చేసిన ఓ అభ్యర్ధి విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు.

- Advertisement -

నీట్ పరీక్ష పేపప్ లీక్ పై జరుగుతున్న విచారణలో భాగంగా అరెస్టు అయిన అభ్యర్ధి అనూరాగ్ యాదవ్ పలు విషయాలు వెల్లడించాడు. ఇందులో తాను నీట్ పరీక్షకు ముందు రోజు రూ.30 లక్షల చొప్పున తీసుకుని నలుగురికి పేపర్ ను అమ్మేసినట్లు తెలిపాడు. సమాధానాలను కూడా వారికి అందించినట్లు తెలిపాడు. అలాగే తనకు లభించిన ప్రశ్నాపత్రం అసలు పరీక్ష పేపర్ తో సరిపోలినట్లు కూడా అనురాగ్ పేర్కొన్నాడు.

బీహార్ లోని దానాపూర్ టౌన్ కౌన్సిల్ కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్ కు మేనల్లుడైన అనురాగ్ యాదవ్.. తాను ఈ కార్యాలయంలోనే పేపర్ ను అభ్యర్ధులకు అమ్మినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ మేరకు తన మేనమామ సహకరించినట్లు తెలిపాడు. మరోవైపు పాట్నాలో నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బీహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం నుంచి నివేదిక కోరింది. అటు సుప్రీంకోర్టు కూడా పేపర్ లీక్ ఆరోపణలపై ఇప్పటికే ఎన్డీఏతో పాటు సంబంధిత శాఖలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దిద్దుబాటు చ‌ర్య‌లు వెంట‌నే చేప‌ట్టాల‌ని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement