Sunday, November 17, 2024

NEET-UG 2024 – రెండు చోట్లే నీట్ పేప‌ర్ లీకేజ్ … సుప్రీం కోర్టు

లోపాల‌ను స‌రిదిద్దుకోండి..
ల‌క్ష‌లాది విద్యార్ధుల భ‌విష్య‌త్ మీ చేతుల‌లోనే ఉంది.
ఎన్ ఎ టి కి హెచ్చ‌రిక
ఇక ఈ కేసును ముగిస్తున్నాం … సుప్రీం కోర్టు

ఆంధ్ర్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ: నీట్-యూజీ 2024 ప‌రీక్ష‌లో వ్య‌వ‌స్థీకృత ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. ప‌రీక్ష ప‌త్రాల లీకేజీ కేవ‌లం పాట్నా, హ‌జారిబాగ్‌లో మాత్ర‌మే జ‌రిగిన‌ట్లు అత్యున్న‌త న్యాయ స్థానం నేడు పేర్కొంది. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర స‌ర్కారు కూడా మ‌ళ్లీ భ‌విష్య‌త్తులో పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్న‌ది.

- Advertisement -

ల‌క్ష‌లాది విద్యార్ధుల భ‌విష్య‌త్ మీ చేతుల‌లోనే ఉంద‌నే విష‌యం ప్ర‌తిక్ష‌ణం జ్ఞాప‌కం ఉంచుకోండి అంటూ ఎన్ ఎ టికి సూచించింది. ఎగ్జామ్ వ్య‌వ‌స్థ‌లో ఉన్న సైబ‌ర్ సెక్యూర్టీ లోపాల‌ను స‌రిదిద్దేందుకు వీలైన సాంకేతికత‌కు తీసుకురావాల‌ని కేంద్రం నియ‌మించిన క‌మిటీ పేర్కొన్న‌ట్లు సుప్రీం త‌న తీర్పులో చెప్పింది. ఎన్టీఏ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోపాల‌ను కూడా త‌మ తీర్పులో పేర్కొన్న‌ట్లు సుప్రీం తెలిపింది. ఇక ఇంత‌టితో ఈ కేసును ముగిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement