వైద్య విద్య లో సూపర్ స్పెషాలిటీ కోర్సులైన ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ ల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను NBEMS (National Board of Examinations in Medical Sciences) రిలీజ్ చుయనుంది. NEET SS పరీక్షకు హాజరైన వైద్య విద్యార్థులు NBE అధికారిక వెబ్ సైట్ అయిన nbe.edu.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. నీట్ పరీక్ష ను సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించారు. సుమారు 15రోజుల్లోనే ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తుండడం విశేషం. అలాగే, ఇదే రోజు అడ్మిషన్ల కు సంబంధించిన కటాఫ్ మార్క్ ను కూడా విడుదల చేయనున్నారు.
కాగా, ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో సూచించిన అర్హత ప్రమాణాల ప్రకారం.. సంబంధిత గ్రూపులలో 50 పర్సంటైల్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు అర్హత సాధించినట్లు ప్రకటించారు. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్‌కార్డ్ సెప్టెంబర్ 22న లేదా ఆ తర్వాత nbe.edu.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందిన బోర్డ్ తెలిపింది.
రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా..!
ఎన్బీఈ అధికారిక వెబ్ సైట్ nbe.edu.in ను ఓపెన్ చేయాలి.
NEET SS Result 2022 లింక్ పై క్లిక్ చేయాలి.
లాగిన్ డిటైల్స్ ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
స్క్రీన్ పై మీ రిజల్ట్ కనిపిస్తుంది.
వివరాలు సరి చూసుకుని రిజల్ట్ పేజ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
భవిష్యత్ అవసరాల కోసం ఆ పేజ్ ను ప్రింట్ తీసుకోండి.