జాతీయ వైద్యవిద్యా అర్హత పరీక్ష రాయబోతున్న పీజీ విద్యార్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కీలక సమాచారం ఇచ్చింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై ఉన్న అనుమానాలకు తెరదించింది. ఏప్రిల్ 12, 2021న అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. nbe.edu.in వెబ్సైట్ నుండి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ 18, 2021న షెడ్యూల్ ప్రకారమే పీజీ అర్హత పరీక్ష ఉంటుందని ప్రకటించింది. నీట్ పీజీ 2021 ఎంట్రెన్స్ పరీక్ష ఏప్రిల్ 18న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement