Monday, November 18, 2024

Neet UG | నీట్ పేపర్ లీక్ కేసు… మరో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థుల అరెస్ట్

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. జంషెడ్‌పూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో బీటెక్ గ్రాడ్యుయేట్, ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అరెస్టు చేసిన వారి సంఖ్య 21కి చేరింది.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయ‌ర్ చదువుతున్న కుమార్ మంగళం బిష్ణోయ్‌తో పాటు మొదటి సంవత్సరం విద్యార్థి దీపేందర్ శర్మ, ఎన్‌ఐటీ జంషెడ్‌పూర్‌లో బీటెక్ (ఎలక్ట్రికల్) గ్రాడ్యుయేట్ అయిన శశికాంత్ పాశ్వాన్ అలియాస్ శశి, అలియాస్ పశులను సీబీఐ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వీళ్లిద్దరూ గతంలో అరెస్టయిన ఇంజనీర్‌ పంకజ్ కుమార్‌ నీట్ పేపర్ ను దొంగిలించడంలో సాయం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement