Wednesday, November 20, 2024

NEET Exam | నీట్ పేపర్ లీక్ కేసు.. కీలక సూత్రధారి అరెస్ట్

నీట్‌-యూజీ (2024) పరీక్ష పేపర్‌ లీకేజీలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న రాజేశ్‌ రంజన్‌ అనే వ్యక్తిని పట్నాలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం పట్నా, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ నేరానికి సంబంధించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.

నిందితుడిని విచారించేందుకు స్థానిక కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో బుధవారం ఇద్దరిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య పది దాటింది. ఇక నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement