Friday, November 22, 2024

Neet – లోక్ స‌భ‌లో నీట్ ర‌చ్చ‌….విపక్షాలు బాయ్ కాట్

ఇవాళ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన కాసేపటికే గందరగోళం నెలకొంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపారు. ఇక, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ స్విచాఫ్ కావడంతో పైనా కూడా స్పీకర్ ఓం బిర్లా వివరణ కూడా ఇచ్చారు. అయితే.. ఎంత సేపటికీ నీట్‌- యూజీ 2024పై చర్చకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

అయితే, అంతకు ముందు రాహుల్ గాంధీ నీట్‌ వివాదం గురంచి ప్రస్తావించారు. పార్లమెంట్ వేదికగా దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీట్‌ వ్యవహార ప్రాధాన్యతను అర్థం చేసుకుని సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ.. దానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదు.. ఫలితంగా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు నిరనస వ్యక్తం చేస్తూ పార్లమెంట్ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement