వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి : నీట్ పీజీ కటాఫ్ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తగ్గించింది. ఈనేపథ్యంలో మెడికల్ సీట్లకు మరోమారు దరఖాస్తులు చేసుకునే అవకాశం లభించింది. నీట్ కటాఫ్ స్కోర్‌ను అన్ని కేటగిరిలకు జీరో పర్సంటేల్ తగ్గించి న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్, యాజమాన్య కోటాలో మరోమారు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈనెల 24వతేది సాయంత్రం 6 గ ంటల వరకు అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాలని వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం సాయంత్రం ప్రకటన జారీ చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ద ృవపత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం తుదిమెరిట్ జాబితాను విడుదలచేస్తారు. పూర్తివివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నారు.