Tuesday, November 26, 2024

నీట్‌ కటాఫ్‌ మార్కులు తగ్గించిన కేంద్రం.. పీజీ డెంటల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్‌ కటాఫ్‌ మార్కులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో పీజీ డెంటల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నీట్‌-2022 పీజీ అర్హత కటాఫ్‌ స్కోర్‌ను 25.714 పర్సంటైల్‌కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 24.286 పర్సంటైల్‌ 174 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ చెందిన వారికి 14.286 పర్సంటైల్‌ 138 మార్కులు, దివ్యాంగులకు 19.286 పర్సంటైల్‌ 157 మార్కులు సాధించిన విద్యార్థులు అర్హత సాధించారు. కటాఫ్‌ మార్కులు తగ్గించడంతో అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్‌ కోటాలో ఎండీఎస్‌ ప్రవేశానికి ఈనెల 20వ తేదివరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలని వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈనెల 18వ తేది ఉదయం 8 నుంచి 20వ తేదిన సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి 23 వరకు దరఖాస్తులు

- Advertisement -

రాష్ట్రంలోని పీజీ దంత వైద్యకోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌- ఎండీఎస్‌ 2022లో అర్హత సాధించిన విద్యార్థులు పీజీ డిప్లొమా, డిగ్రీ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి విద్యార్థులు మంగళవారం ఉదయం 8 నుంచి 23వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ని ర్దేశిత దరఖాస్తులు పూర్తిచేయడంతో పాటు విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేయాలని యూనివర్సిటీ పేర్కొన్నది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తుందని, ప్రవేశాలకు సంబంధించి పూర్తి సమాచారం కొరకు యూనివ ర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వర్గాలు తెలుపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement