Wednesday, November 20, 2024

NEET : రేపే నీట్ 2024 ప‌రీక్ష‌…ఒక్క నిమిషం ఆల‌స్య‌మైన నో ఎంట్రీ..

- Advertisement -

దేశవ్యాప్తంగా వైద్య,విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షను రేపు నిర్వ‌హించ‌నున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగుతుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహణకు అన్ని సన్నాహాలు పూర్తి చేసింది.

ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా, ఈ పరీక్ష మొత్తం 13 భాషలలో పెన్, పేపర్ విధానంలో నిర్వహించ‌నున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన ప‌రీక్షా కేంద్రాల‌లోకి అనుమ‌తించ‌బోరు. ఇక అభ్యర్థులు హాల్ టికెట్​తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వెంట తీసుకురావలసి ఉంటుంది. తెలంగాణ‌లో ప్ర‌ధాన న‌గ‌రాల‌లోనూ, ముఖ్య‌మైన ప‌ట్ట‌ణాల‌లోనే ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ప‌రీక్షా కేంద్రాల‌ను ఒక రోజు ముందుగానే ప‌రిశీలించుకోవాల‌ని నిర్వాహ‌కులు విద్యార్ధుల‌కు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement