వైద్య విద్యా ప్రవేశాల జాతీయస్థాయి పరీక్ష నీట్ దేశవ్యాప్తంగా ఈ మధ్యాహ్నం ప్రారంభమైంది. నిర్ణీత సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వచ్చిన వారిని అనుమతించలేదు. దాంతో అనేకమంది విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
నీట్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 202 పట్టణాల్లో 3,842 పరీక్ష కేంద్రాల్లో జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ జరుగుతుంది. పెన్ను, పేపరు విధానంలో హిందీ, ఇంగ్లిష్ తో పాటు మొత్తం 11 భాషల్లో నీట్ నిర్వహిస్తున్నారు. నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే లక్షమందికి పైగా ఉన్నారు. తెలంగాణకు చెందినవారు 55 వేల మంది, ఏపీకి చెందినవారు 50 వేల మంది ఉన్నారు.