Saturday, November 23, 2024

తెలంగాణ సాంప్రదాయ పానీయంగా నీరా.. రేపు ప్రారంభించనున్న కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అత్యంత విలువైన పోషకాలతో అధునాతన సాఫ్ట్‌డ్రింక్‌గా నీరా ప్రజా బాహుళ్యంలోకి వస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా రేప‌టి నుంచి నీరా కేఫ్‌ అందుబాటులోకి రానున్నది. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నీరాకేప్‌ అండ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రారంభించనున్నారు. సాయంకాలం, సాగర తీరంలో అన్నట్లుగా పసందైన తెలంగాణ వంటకాలు, నీరాతో ఆరోగ్యం, ఆనందం అన్నట్లుగా నీరా కేంద్రం రెడీ అయింది. అసలు ఏ మాత్రం ఆల్కహాల్‌లేని పానీయంగా నీరా రానున్నది. రాష్ట్రంలో మొట్టమొటి నీరా కేఫ్‌ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈ మేరకు తుది నెక్లెస్‌ రోడ్‌లో నేటి ఉదయం 11:30 గంటలకు మంత్రులు ఈ కేఫ్‌ను ప్రారంభించనున్నారు.

రూ. 13కోట్ల వ్యయంతో హుఏస్సేన్‌ సాగర్‌ తీరంలో నెక్లెస్‌ రోడ్‌లో నీరా కేఫ్‌ సిద్ధమైంది. అంతే కాకుండా నీరా కేఫ్‌నుంచి హుస్సేన్‌ సాగర్‌కు బోట్‌ రైడింగ్‌ అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. తాటి, ఈత చెట్లనుంచి ప్రకృతి సిద్ధంగా లభించే పానీయాన్ని నీరాగా ఈనెల 4నుంచి అందుబాటులోకి రానున్నది.

ఎంతోకాలంగా నీరాను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ సర్కార్‌ ప్రయత్నించింది. తొలుత హైదరాబాద్‌లో స్టాల్‌ను ఏర్పాటు చేసి దశలవారీగా జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నీరా లైసెన్సులను గౌడ కులస్తులకు, కార్మికులకు మాత్రమే ఇచ్చేలా ప్రభుత్వం చట్ట్టం తేనున్నది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ నీరా స్టాల్స్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతానికి వీటి అమ్మకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించాలని, ఆ తర్వాత గౌడ కులస్తులకే వీటిపై హక్కులు కల్పించి, గీత వృత్థిపై ఆధారపడిన కులాల సంక్షేమానికి పాటు పడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

- Advertisement -

అత్యంత ఔషద లక్షణాల కలయిక…

కల్లులో తక్కువ మొత్తంలో ఆల్కహాలు కల్గి ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తున్నదని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. సమృద్ధిగా ఖనిజ లవణాలు, విటమిన్లతో ఊబకాయం, మధు మేహం నివారణకు ఔషదంగా పనిచేస్తుందని పరిశోధనలు రుజువు చేశాయి. రోగ నిరోదక శక్తికి అవసరమైన పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయని, తగిన మోతాదులో సేవిస్తే రోగ్యానికి మంచిదని జాతీయ పోహకాహర సంస్థ(ఎన్‌ఐఎన్‌) తేల్చింది. ఐరన్‌, కాల్షియం వంటివి ఎముకల పటిష్టానికి పనిచేస్తాయని, రక్తు వృద్ధికి దోహదమవుతాయని ఈ సంస్థ నివేదిక ఇచ్చింది. మినరల్స్‌, విటమిన్లు ఆరోగ్య సమతుల్యతకు పాటుపడ్తాయపని, ఇందులో విరివిగా ఉండే ప్యాటీ ఆసిడ్స్‌ శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోదిస్తాయని డాక్టర్లు, సైంటిస్టులు వెలుగులోకి తెచ్చారు. ఇది షుగర్‌ వ్యాధిని కట్టడి చేయడంలో కీలకంగా పనిచేస్తుందని రుజువు చేశారు. విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచి, తాటి కల్‌లలోని సాల్యుబుల్‌ విటమిన్స్‌లో థయామిన్‌ రిబోప్లేవిన్‌, నియాసిన్‌, ప్యాంటాసిడ్‌, విటమిన్‌ సి వంటివాటితోపాటు కెరెటోనాయిడ్స్‌ పుష్కలంగా ఉన్నాయని ఇది శరీరంలోని కొవ్వును నియంత్రించే సాచ్యురేటెడ్‌ ప్యాటీ ఆసిడ్స్‌, ఇతర యాసిడ్స్‌ను కల్గి ఉన్నాయని గుర్తించారు.

సూర్యోదయానికి ముందు తాటిచెట్టు, ఈత చెట్టునుంచి దించిన పానీయాన్ని నిల్వ చేసి నీరాగా రూపొందించి బహిరంగ మార్కెట్‌లో విక్రయించే దిశగా సర్కార్‌ కృషి చేస్తోంది. తాజాగా కులవృత్తులకు తెలంగాణ సర్కార్‌ పెద్దపీట వేస్తుండటం ఈ అంశానికి బాగా కలిసి వస్తోంది. దీంతో మరోసారి తెలంగాణలో నీరా తెరపైకి వస్తోంది. గతంలో నల్గొండ పూర్వ జిల్లా, భువనగిరికి సమీపంలో నీరా తయారీకి కసరత్తు జరిగినప్పటికీ అది పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి రాలేదు.

తీయని రుచి, చూడముచ్చటైన రంగు, అత్యంత విలువైన, బలాన్నిచ్చే పోషకాలు నీరాలో పుష్కలంగా ఉండనున్నాయి. ఇటీవలే భారత ఆహార సంస్థ, సీఎస్‌ఐఆర్‌ ఇటీవలే ఇదే విషయాలను తన సర్వేలో తేల్చింది. ఇప్పటికే భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు, శ్రీలంక, ఆఫ్రికా, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, మయన్మార్‌లలో భారీగా వినియోగంలో ఉంది. ఇందులో విలువైన కార్బోనేట్లు, పీహెచ్‌2 1,058నుంచి 1,077వరకు ఉంటాయి. ఇందులో సుక్రోస్‌ 100ఎంఎల్‌కు 12.3నుంచి 17.4, ప్రోటీన్లు 0.23 నుంచి 0.32 ఉంటాయి. మొత్తంగా 15.2 నుంచి 19.7 సాలిడ్‌ రేటింగ్‌ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement