హైదరాబాద్, ఆంధ్రప్రభ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ నాయక్ హత్య కేసులో ఎ3 గా ఉన్న నిందితురాలు నీహారికరెడ్డికి రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం ఆమెను చర్లపల్లి జైలు నుంచి విడుదల చేశారు. నీహారిక ప్రేమ కోసం నవీన్ ను ఆమె ప్రియుడు హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో హరిహరకృష్ణ ప్రధాన నిందితుడు ( ఏ1 ) గా ఉన్నారు. ఆయనతో పాటు ఎ2 గా హాసన్, మూడో నిందితురాలిగా నీహారికరెడ్డి (ఎ3) ఉన్నారు.
తన ప్రియురాలు నీహారిక కోసం ఫిబ్రవరి 17 న నవీన్‌నాయక్‌ను హరికృష్ణ అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతుడి తల,గుండె, చేతి వేళ్లు,మర్మాంగాలు, పెదవులు తీసి వాటిని నీహారికకు చూపించి సమీపంలోని మన్నెగూడ పడేశాడు. అంతేగాక ఖర్చుల కోసం నీహారికతో రూ.15 వందలు కూడా తీసుకున్నారు.
హత్య తర్వాత హాసన్ అనే మిత్రుడు హరిహరకృష్ణకు షెల్టర్ ఇవ్వడంతో పాటు శరీరాంగాలను పారేయడంలో సహకరించాడు. దీంతో హాసన్‌పై కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 20 న నీహారికను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని నవీన్ మృతదేహాన్ని కూడా చూపించారని కూడా పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.