Tuesday, November 26, 2024

నీట్‌ పీజీ-2021 పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు.. స్పెషల్ కౌన్సెలింగ్‌ నిర్వహణ వీలుకాదని స్పష్టీకరణ

నీట్‌ పీజీ 2021లో ఖాళీగా ఉన్న 1,456 మెడికల్‌ సీట్ల కోసం మరోసారి స్పెషల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్‌ చేసింది. మరోసారి కౌన్సిలింగ్‌ నిర్వహించినా, సీట్లు పూర్తిగా భర్తీ కావని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. ప్రజారోగ్యంతో ముడిపడిన వైద్య విద్య నాణ్యతలో రాజీ పడలేమని జస్టిస్‌ ఎంఆర్‌ షాహ్‌, జస్టిస్‌ అనిరుద్ధబోస్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్లకు స్పష్టం చేసింది. నీట్‌ పీజీ సీట్ల విషయంలో మరోసారి ప్రత్యేక కౌన్సిలింగ్‌ నిర్వహించరాదని కేంద్రప్రభుత్వం, మెడికల్‌ కౌన్సిలింగ్‌ కమిటీలు తీసుకున్న నిర్ణయాన్ని ఏకపక్ష నిర్ణయంగా భావించడం లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది.

ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్రం, ఎంసీసీలు ఆ నిర్ణయం తీసుకున్నాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. నీట్‌ పీజీ -21 సీట్ల భర్తీ కోసం నాలుగు రౌండ్లు ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరిగిందని, భర్తీకాని 1,456 సీట్ల కోసం స్పెషల్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించినట్లు హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించారు. అయితే, మరోసారి కౌన్సిలింగ్‌ నిర్వహించడం సాధ్యం కాదని, అందుకు గతంలో ఉపయోగించిన సాఫ్ట్‌ వేర్‌ మరోసారి వినియోగించడానికి ఆయన ధర్మాసనానికి విన్నవించారు. పిటిషన్‌ దాఖలు చేసిన డాక్టర్లు నీట్‌ పీజీ 2021-22 పరీక్షలు రాసి ఆలిండియా కోటా కేటగిరిలో మొదటి, రెండో రౌండ్‌కు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement