Saturday, November 23, 2024

నీట్‌ పీజీ పరీక్ష వాయిదా, 6 నుంచి -8 వారాలు పొడిగింపు.. మార్చి 12న తొలుత నిర్ణయం

నీట్‌ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. 6 నుంచి 8 వారాల పాటు వాయిదా వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 12న జరగాల్సిన నీట్‌ పరీక్ష.. వాయిదా పడినట్టు తెలిపింది. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (నీట్‌ పరీక్ష) 2022ను వాయిదా వేయాలని కోరుతూ.. ఆరుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నీట్‌ పరీక్ష జరిగే సమయంలో నీట్‌ పీజీ-2021 కౌన్సెలింగ్‌ జరుగుతోందని, అందుకే నీట్‌ పీజీ – 2022 పరీక్షను వాయిదా వేయాలని పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అయితే అంతకుముందే నీట్‌ పరీక్షను వాయిదా వేస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ డాక్టర్ల నుంచి వచ్చిన అనేక వినతులు వచ్చినట్టు ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్‌ శుక్రవారం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. 2022 మే/జూన్‌ నెలలో జరిగే పీజీ కౌన్సెలింగ్‌-2022లో చాలా మంది ఇంటర్న్స్‌ పాల్గొనే అవకాశం ఉండదని చెబుతున్నారని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని నీట్‌ పీజీ – 2022ను ఆరు నుంచి 8వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్టు నోటీసులో తెలిపారు. నీట్‌ పీజీ – 2022 పరీక్షను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎన్‌బీఈ) నిర్వహిస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement