చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భాగంగా ఇవ్వాల (మంగళవాం) జరిగిన మ్యాచ్ లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత హెచ్‌ఎస్ ప్రణయ్ కి తొలి రౌండ్‌లోనే షాక్ తగిలింది. చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మలేషియాకు చెందిన ఎన్‌జిట్జే యోంగ్‌తో పోటీ పడగా… 12-21, 21-13, 18-21 తేడాతో ఓటమిపాటయ్యాడు.
ప్రస్తుత కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ కూడా డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్ ఆంటోన్‌సెన్‌తో ఒక గంట 18 నిమిషాలు పాటు జరిగిన మూడు గేమ్‌లలో 21-23, 21-16, 9-21 తేడాతో ఓడిపోయి మొదటి రౌండ్‌లోనే టోర్నీ నుండి నిష్క్రమించాడు.
ఇక, ప్రియాంషు రజావత్ కూడా 13-21, 24-26 తేడాతో ఇండోనేషియాకు చెందిన షెసర్ హిరెన్ రుస్తావిటో చేతిలో ఓడిపోయాడు. దీంతో చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోని పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ ఛాలెంజ్ ముగిసింది.
ఇక, మహిళల డబుల్స్ లో భారత జోడీ ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ 18-21, 11-21 తేడాతో చైనాకు చెందిన టాప్ సీడ్ చెన్ క్వింగ్ చెన్-జియా యి ఫ్యాన్ చేతిలో ఓడిపోయారు.
కాగా, మోన్స్ డబుల్స్ లో భారత జోడీ సాత్విక్- చిరాగ్ ఇండోనేషియాకు చెందిన ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ-బగాస్ మౌలానాతో రేపు (బుదవారం) తమ ప్రారంభ మ్యాచ్ ఆడనున్నారు.