జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎలక్షన్స్ లో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన కీలక మార్పు గురించి బెనర్జీ ప్రస్తావించారు. MVA ప్రభుత్వం అధికారం నుండి నిష్క్రమించడానికి దారితీసింది, ఎవరూ ఊహించని విధంగా.. ఏకనాథ్ షిండే నూతన ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను డిప్యూటీగా నియమించారు.అభ్యర్థిని ప్రకటించడానికి ముందు బీజేపీ తమతో చర్చించి ఉంటే.. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ద్రౌపదికి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలించే వాళ్లమనీ, అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఒకే అభ్యర్థిని ఎంచుకోవడమే దేశానికి మంచిదని అన్నారు.
అయితే రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఇచ్చే ముందు వారితో ఏమీ చర్చించకపోవడం NDA తప్పు అని బెనర్జీ తెలిపారు.. రాష్ట్రపతి ఎన్నికలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నానని, అన్ని మతాలు, కులాలు, వర్గాల వారిని గౌరవిస్తున్నామన్నారు. ఈ పరిస్థితిలో తాను ప్రతిపక్ష పార్టీలతో కట్టుబడి ఉంటానని బెనర్జీ చెప్పారు. వారి నిర్ణయం సమిష్టిగా తీసుకున్నట్లు కూడా చెప్పారు. 17- 18 రాజకీయ పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయనీ, ఆ నిర్ణయం కేవలం తనది మాత్రమే కాదనీ, అన్ని ప్రతిపక్షాలు నిర్ణయమని అన్నారు. ప్రతిపక్షాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో.. ఆ నిర్ణయాన్ని అంగీకరిస్తానని అన్నారు.