Thursday, November 21, 2024

ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించిన ఎన్‌సీటీఈ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రా మ్‌ల గుర్తింపు ప్రక్రియ మొత్తాన్ని క్రమబద్ధీకరించ డానికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. విద్యాసంస్థలు ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడం, గుర్తింపు జారీ చేయడం లాంటి ప్రక్రియను ఈ పోర్టల్‌ ద్వారా సులభతరం చేయనున్నట్లు ఎన్‌సీటీఈ పేర్కొంది. ఇటీవల ప్రారంభించిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ల దరఖాస్తు ప్రక్రియను సైతం ఈ పోర్టల్‌ ద్వారానే చేపట్టనున్నట్లు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement