Friday, November 22, 2024

NCP Split – రాజకీయాలలో ఇదే పెద్ద దోపిడీ – శరద్ పవార్

ముంబై -మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు చేరడంపై ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఇది గూగ్లీ కాదని.. దోపిడీ అని పేర్కొన్నారు. ఎన్సీపీ మొత్తం తనకు అండగా నిలుస్తోందని అజిత్ పవార్‌ చెప్పడంపై స్పందిస్తూ.. త్వరలోనే నిజం బయటపడుతుందని అన్నారు. ‘‘రెండు రోజుల క్రితం ఎన్సీపీ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ… ఎన్సీపీపై ఫిర్యాదులు, అవినీతి ఆరోపణలను ఆయన ప్రస్తావించారని అన్నారు. ఇప్పుడు ఎన్సీపీలో తన సహచరులు కొందరు మంత్రులుగా ప్రమాణం చేసినందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు. తద్వారా (ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం) ఆరోపణలన్నీ క్లియర్ అయినట్లు స్పష్టమవుతోందని అన్నారు.

6వ తేదీన సమావేశానికి రావాల్సిందిగా తాను నాయకులందరినీ పిలిచానని శరద్ పవార్ చెప్పారు. ఆ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించి.. పార్టీలో కొన్ని మార్పులు చేయాలని భావించామని తెలిపారు. అయితే ఆ సమావేశం జరగకముందే.. కొందరు పార్టీ సహచరులు భిన్నమైన వైఖరి తీసుకున్నారని అన్నారు. అయితే ఇదేమి కొత్త విషయం కాదని.. 1980లో తాను నాయకత్వం వహించిన పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. అయితే అందరూ వెళ్లిపోయాక, 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారని చెప్పారు. కానీ తాను ఆ సంఖ్యను బలపరిచానని.. తనను విడిచిపెట్టిన వారు వారి నియోజకవర్గాల్లో ఓడిపోయారని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement