Friday, November 22, 2024

న‌యీండైరీ డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ కు నోటీసులిచ్చిన తెలంగాణ హైకోర్టు

నయీండైరీ చిత్రంలో గాయ‌ని బెల్లి ల‌లిత క్యారెక్ట‌ర్ అభ్యంత‌ర‌క‌రంగా ఉందంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించారు ల‌లిత కుమారు సూర్య ప్ర‌కాష్.. 1999లో బెల్లి ల‌లిత దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కాగా అప్ప‌ట్లో ఆమెని న‌యీం హ‌త్య చేయించాడ‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోపించారు. నయీం డైరీ చిత్రం విడుదల పై తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తాజాగా నయీం డైరీ చిత్రంలో బెల్లి లలిత క్యారెక్టర్ అయిన ‘లత’ ను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆమె కుటుంబ సభ్యులు.

ఈ చిత్రం రిలీజ్ అయిన నేపథ్యంలోనే.. ఈ సినిమాని నిలిపివేయాల‌ని సూర్య ప్రకాష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చిత్రం డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు నోటీసులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. అయితే ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది హై కోర్టు. అప్పటి వరకు నయీం డైరీ చిత్రం ప్రదర్శన పై స్టే విధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement