న్యూ ఢిల్లీ – ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ గేర్ మార్చింది. హస్తిన కేంద్రంగా చేరికలతో ఆ పార్టీలో నయా జోష్ కనిపిస్తోంది..నిన్న పొంగులేటి, జూపల్లి సహా 35 మంది నేతలు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై..పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, మాణిక్‌రావ్ ఠాక్రే తో పాటు.. టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనరసింహా, మల్లు రవి, షబ్బీర్ అలీ, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొననున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నూతన చేరికలు ఉన్న నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం..ముందస్తు టికెట్ల ప్రకటన అంశంపై డిస్కస్ చేసే అవకాశముంది..అలాగే.. YSRTPని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..షర్మిల పార్టీ ఇష్యూపైనా చర్చించే అవకాశముంది