Saturday, November 23, 2024

ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులో మళ్లీ టెన్షన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులో మళ్లీ టెన్షన్‌ రేగింది. ఒరిస్సా, ఆంధ్రా, చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల సరిసద్దులో మావోల సంచారం కారణంగా అక్కడ నిరం తరం ఉత్కంఠ వాతావరణం కొనసాగు తూనే ఉంటుంది. అయితే గత పదిహేను రోజులుగా ఇక్కడ పరిస్ధితి మరింత సున్నితం గా మారింది. సరిహద్దు జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో భద్రత బలగాలు నిరంతరం పహారా కాయడంతోపాటు ఇంటిలిజెన్స్‌. కేంద్ర దళాలు నిత్యం దండకారణ్యంలో కూంబింగ్‌ జరుపు తూనే ఉంటారు. ఈ నెల 11వ తేదీన చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ నుంచి మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ అలియాస్‌ హిడ్మా తప్పించుకున్న విషయం తెలిసిందే. బీజాపూర్‌ జిల్లాలోని కమాండర్‌ మాడ్వి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ అలియాస్‌ హిద్ముల్లా లక్ష్యంగా పోలీసులు, భద్రత దళాలు ఈ స్పెషల్‌ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ దాడుల్లో ముఖ్య నేత హిడ్మా మృతి చెందాడంటూ తొలుత ప్రచారం జరిగింది. దీంతో భద్రత బలగాల లక్ష్యం నెరవేరిందనుకుంటున్న సమయంలో హిడ్మా బతికే ఉన్నాడంటూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేయడంతో మరలా పరిస్ధితి మొదటి కొచ్చింది.

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాల వేటలో భాగంగా మావోయిస్టులకు చెందిన శిబిరం లో హిడ్మా ఉన్నాడనే పక్కా సమాచారంతో కూంబిం గ్‌లో భాగంగా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపగా గాయ పడిన జవాన్లను తరలించేందుకు వచ్చిన హెలి కాప్టర్‌పై కూడా కాల్పులు జరిపిన ఘటనలో హిడ్మా మర ణించారని ప్రచారం రావడంతో ఖండిస్తూ హిడ్మా సేఫ్‌ అంటూ మావోపార్టీ ధృవీకరించింది. పైగా హిడ్మాతోపాటు మరికొందరు కీలక నేతలపై పది లక్షల రూపాయల వరకు రివార్డు కూడా ఉంది. హిడ్మా కోసం కొంతకాలంగా నాలుగు రాష్ట్రాల బలగాలతోపాటు కేంద్రానికి చెందిన- సీఆర్పీఎఫ్‌ కోబ్రా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. గత పాతికేళ్ళుగా మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న హిడ్మాకు దాడుల్లో వ్యూహకర్తగా పేరుంది. దాదాపు 200 మంది పోలీసులు ఇతని వ్యూహానికి బలైనట్లు పోలీ సులు చెబుతున్నారు. కూంబింగ్‌ ఆపరేషన్లు నిర్వ హించే పోలీసు బలగాలపై, సీఆర్పీఎఫ్‌ శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించడంలో హిడ్మా పట్టున్న హిడ్మా లక్ష్యంగా దండకారణ్యంలో బలగాలు ముం దుకు సాగుతున్నాయి. హెలికాప్టర్‌, డ్రోన్ల ద్వారా వేట సాగించినా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు చిక్కినట్లే చిక్కితప్పించుకుంటున్న హిడ్మా తలపై రూ.45 లక్షల రివార్డు ఉంది. అలాంటి హిడ్మా మరోసారి తప్పించు కోవడాన్ని సవాల్‌గా తీసుకున్న బలగాలు గత 15 రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నాయి.

భారీ డంప్‌ స్వాధీనం
దీనిలో భాగంగానే ఏఓబి సరిహద్దులో ప్రస్తుతం హైటెన్షన్‌ కొనసాగుతోంది. ఆంధ్రా-ఒడిస్సా సరి హద్దులో ని ర్వహిస్తున్న కూంబింగ్‌లో పోలీసులు భారీగా ఆయుధాల డంప్‌ స్వాధీనం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు తులసి అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీ ఎత్తున ఆయుధా లు, పేలుడు సామాగ్రిని గుర్తించారు. డంపులో ఎయిర్‌ పిస్టల్‌ బ్యారల్‌ గ్రానైట్‌ లాంచర్‌, 13 మందు పాతరలు, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ, 113 రకాల పేలుడు సామాగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నా రు. మావోయిస్ట్‌ల కదలికలపై దృష్టి సారించిన ఆయా రాష్ట్రాల పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నా రు. డంప్‌ బయటపడటంతో తనిఖీలు పెంచారు. భారీగా ఆయుధాలు బయటపడటంతో సరిహద్దులో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అండర్‌ గ్రౌండ్‌లో మావోయిస్ట్‌లు పెద్ద ఎత్తున వ్యూహ రచన చేస్తున్నట్లు-గా పోలీసులు భావిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. తప్పించుకున్న హిడ్మా నేతృత్వంలోని మావోలు సరిహద్దులో ఎక్కడికక్కడ ఆయుధాలు డంప్‌ చేసి ఉంటారని, అదేవిధంగా ప్రతి దాడులకు సిద్దమవుతున్నట్లుగా నిఘా వర్గాలు అను మానిస్తున్నాయి. మొత్తం 26 దాడుల్లో కీలక నిందితు నిగా ఉండి అనేక సార్లు బలగాల కాల్పుల నుంచి తప్పించుకున్న హిడ్మా, పలువురు కీలక నేతల కోసం రివార్డు ప్రకటించిన ప్రభుత్వాలు గత 15 రోజుల నుం చి కూంబింగ్‌ ముమ్మరం చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement