Friday, November 22, 2024

దండకారణ్యంలో అలజడి

హైదరాబాద్ : దండకారణ్యంలో మళ్ళీ అలజడి మొదలైంది. చత్తీస్‌గఢ్‌ అటవీ మార్గాన మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ లోకి ప్రవేశించారన్న సమాచారంతో పోలీసు బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి. కరోనా సమయం నుండి తెలంగాణలో మావో ల కార్యకలాపాలు పెరగ్గా, ఇపుడు తెలంగాణ బలగాలకు.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మావో బృం దాలు కూడా తోడుకాగా, ఏజెన్సీ ప్రాంతాల్లో వేట కొనసాగుతోంది. పోడు సమస్యను ఆధా రంగా చేసుకుని గిరిజనుల్లో ఉన్న అసంతృప్తిని మావోయిస్టులు తమ రిక్రూట్‌మెంట్లకు విని యోగించుకోగా, ఛత్తీస్‌గఢ్‌లో పలువురు అటవీ అధికారులపై దాడులకు పాల్పడ్డ సంఘ టనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం పోడు సమస్యను పరిష్కరించకపోవడం, అటవీ అధి కారుల దాడులకు విసిగి.. అటవీ పరిసర ప్రాం తాల ప్రజలు అనివార్యంగా ఇతర ప్రత్యామ్నా యాల వైపు చూస్తున్నారు. ఆదిలాబాద్‌ టు అశ్వారావుపేట ఏజెన్సీ ప్రాంతంలో ఇది అశాం తికి కారణమవుతోంది. గతంలో మావోల కార్యకలాపాలు ప్రారంభమైన సమయంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి పలు జిల్లాల్లో పర్య టించి స్థానిక పోలీసుస్టేషన్లను సన్నద్దం చేశారు. ఇటీవల తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాం తాల్లో భారీ స్థాయిలో బూబీట్రాప్స్‌ బయట పడడం పోలీసులను విస్మయానికి గురిచేయ గా, తాజాగా ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో ఏడుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయగా, వారి వద్ద పేలుడు పదార్థాలతో పాటు వెదురు బొంగులు, ఖాళీ బీరు బాటిళ్లు, విల్లంబులు, డైరెక్షనల్‌ మైన్‌ ట్రిగ్గర్లకు సంబంధించిన సామాగ్రితో పట్టుబడడం విశేషం. మావోయిస్టులు తమ ఎత్తుగడలను మార్చి అందుబాటులో ఉన్న వనరులతోనే భారీ విధ్వంసం సృష్టించేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. చర్ల ప్రాంతంలోనూ మావోలు పేల్చివేతకు ఏర్పాటుచేసిన సామాగ్రిని పోలీసులు కనుగొన్నారు. చర్ల పోలీసులు ఆ ప్రాంతంలో 78 చోట్ల పెద్దపెద్ద గోతులు తీసి అమర్చిన 100 బూబీట్రాప్స్‌ వెలికితీశారు. మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్‌, దామోదర్‌, ఆజాద్‌, శారదక్క ఆదేశం మేరకు రాంపురం, భీమారం, పూసుగుప్ప గ్రామాల మిలీషియా సభ్యులు, మావోయిస్టు దళ సభ్యులు కలిసి ఈ బూబీట్రాప్స్‌ అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
బూబీట్రాప్స్‌ సవాల్‌
శత్రువులను మానసికంగా బలహీనపర్చి వారిపై మెరుపు వేగంతో దాడి చేయడం, ఫలితంగా ఎక్కువ స్థాయిలో ప్రాణనష్టం జరిగేందుకు బూబీట్రాప్స్‌ వ్యూహాన్ని వినియోగిస్తారు. వీటిని అటవీ ప్రాంతంలోని రెండువైపులా రాళ్లు, చెట్లు ఉండి మధ్య చిన్న దారి ఉన్న ప్రదేశంలో ఎక్కువగా అమరుస్తారని చెబుతున్నారు. దీనివల్ల పోలీసు బలగాలు వాటిపై అడుగు వేయగానే అందులో చిక్కుకుని లేవడం కష్టంగా ఉంటుందని, ఆ టైమ్‌లోనే మావోయిస్టులు దాడిచేసి హత మార్చేందుకు ఇలా వ్యూహరచన చేస్తుంటారని నక్సల్స్‌ కార్యకలాపాల అదుపులో అనుభవమున్న అధికారులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఇలా బూబీట్రాప్స్‌ను ఉపయోగించి పోలీసులకు ఎక్కువగా ప్రాణనష్టం కలిగించిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఈ విధానాన్ని పాతకాలంలో మావోయిస్టులు ఎక్కువగా ఉపయోగించేవారని తెలుస్తోంది. మళ్లిd ఈ పద్ధతినే ఉపయోగించేందుకు సిద్ధ పడడం.. తాజాగా వివిధ ప్రాంతాల్లో భారీ స్థాయిలో దొరకడంతో దీనిని పోలీసుయంత్రాంగం సవాల్‌గా తీసుకుంది.
విస్తృత గాలింపులు
మావోయిస్టులు ములుగు, భద్రాద్రి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సంచరిస్తూ.. సంచలనాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టులు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడం, పోలీసు శాఖ సన్నద్దతకు సంబంధించి పలు కథనాలు ప్రచురితం కాగా, ఏజెన్సీ ప్రాంతం.. దండకారణ్య పరిసర ప్రాంతాల్లో నక్సల్స్‌ కార్యకలాపాల కట్టడిలో అనుభవమున్న అధికారులను నియమించారు. ఇపుడు విస్తృతంగా కూంబింగ్‌లు జరుగుతుండగా, మావోలు ఎలాంటి సంచలనాలకు పాల్పడకుండా ఎక్కడికక్కడ వ్యూహాలకు బ్రేకులు వేస్తున్నారు. తెలంగాణ బృందాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తుండడంతో.. ఇపుడు ఛత్తీస్‌గఢ్‌ బృందాలు కూడా వీరికి జత కలిసినట్లు చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ.. పోలీసులు మావోల కార్యకలాపాలపై నిఘా వేయగా, మావోలు కూడా గతంలో తీవ్రంగా నష్టపరిచిన కొరియర్‌ వ్యవస్ధను పూర్తిగా నమ్మడం లేదు. అటు మావోల అలజడి, ఇటు పోలీసుల నిఘాతో దండకారణ్యప్రాంతంలో ఇనుప బూట్లచప్పులు, తుపాకీల వేట ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement