ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సలైట్లపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సలైట్లు మరణించిన అంశంపై సీఎం విష్ణు దేవ్ స్పందించారు. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు డీఆర్జీ, బీఎస్ఎఫ్ సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఇది తమ ప్రభుత్వ అతిపెద్ద విజయంగా అభివర్ణించారు.
చారిత్రక ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న జవాన్లు, భద్రతా సిబ్బందిని తాను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 19న బస్తర్ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలని నక్సలైట్లు భావించినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం బస్తర్, కంకేర్ లోక్‌సభ నియోజకవర్గాలకు సమీపంలో ఉంది. బస్తర్‌లో ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి.