Tuesday, November 26, 2024

నవనీత్‌ రాణా దంపతులకు.. 14 రోజుల పాటు జుడీషియల్‌ రిమాండ్‌

నవనీత్‌ రాణా దంపతులను 14 రోజులు జుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ హాలిడే అండ్‌ సన్‌డే కోర్టు ఆదేశాలిచ్చింది. పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రేట్‌ నిరాకరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామని నవనీత్‌ రాణా మొదట్లో దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత విరమించుకున్నారు. అయితే వీరి వల్ల వైషమ్యాలు చెలరేగే ఛాన్స్‌ ఉందంటూ శివసేన నేతలు ఆరోపించారు. దీంతో పోలీసులు ఈ దంపతులను శనివారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. ఆదివారం ఉదయం మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ అండ్‌ సన్‌డే కోర్టు మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా వారిని మే 6 వరకూ జుడీషియల్‌ రిమాండ్‌కు పంపింది.

మరోవైపు ఏప్రిల్‌ 29 న వీరిద్దరి బెయిల్‌ పిటిషన్‌ విచారణకు రానుంది. నవనీత్‌ రాణా దంపతులపై దేశద్రోహ అభియోగం మోపారు. ఈ అభియోగంపై వారిద్దరి తరపు న్యాయవాది తప్పుబట్టారు. హనుమాన్‌ చాలీసా పఠించడం 153 (ఏ) కింది రాదని, ఇదో బోగస్‌ కేసు అని మండిపడ్డారు. వీరు బెయిల్‌పై వచ్చే ఛాన్స్‌ ఉంది కాబట్టే పోలీసులు రెండో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారని న్యాయవాది ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement