కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. దేశంలోని 40కి పైగా రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి ఈ ఆందోళనను నిర్వహిస్తున్నాయి. రేపటి బ్లాక్ డేకు ఇప్పటికే దేశంలో పలువురు ముఖ్యమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. అలాగే, వామపక్ష పార్టీలతో పాటు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. వారికి మద్దతుగా పంజాబ్‌లోని పటియాలాలోని తన ఇంటిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధు తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. ప్రతి ఒక్క పంజాబీ రైతులకు తప్పనిసరిగా మద్దతు తెలపాలని ఆయన కోరారు. కాగా, కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భంగా రేపు బ్లాక్ డే పాటించాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement